తమిళనాడులోని తిరుపూరు, కోయంబత్తూరు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో శనివారం రాత్రి ఏటీఎస్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆ క్రమంలో 31మంది అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు.
పోలీసులకు బంగ్లాదేశీ చొరబాటుదారుల గురించి నిర్దిష్ట సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఆ సోదాల్లో చొరబాటుదారులు పట్టుబడ్డారు.
బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు పశ్చిమబెంగాల్ దగ్గర భారత్లోకి చొరబడ్డారు. ఇక్కడకు వచ్చాక నకిలీ పత్రాలతో దొంగ ఆధార్ కార్డులు సంపాదించారు. ఆ పత్రాలతో తమిళనాడులోని తిరుపూరు చేరుకున్నారు. అక్కడ ఒక దుస్తుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల్లో చేరారు.
మొత్తం 31మంది చొరబాటుదార్లనూ ఒకేసారి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపూరు, పల్లాడం పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. ఆదివారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అధికారికంగా అరెస్ట్ చేసారు.