భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండపైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి, మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాడు. మోకాళ్ళ పై తిరుమల మెట్లెక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్రెడ్డి, మంచి ప్రదర్శనతో ఆకట్టకున్నాడు. సెంచరీ సాధించాడు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన నితీశ్ 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నితీశ్ ఘనత సాధించాడు.