పెండింగ్ బిల్లులకు మోక్షం …
2025 జనవరి లో పలు శాఖలకు రూ.8వేల కోట్ల చెల్లింపులు
శాఖలవారీగా చెల్లింపులు చేస్తోన్న కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ప్రభుత్వం, పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వైసీపీ పాలనలో పలు శాఖలకు ప్రభుత్వం పడిన బకాయిలను ఎన్డీయే ప్రభుత్వం చెల్లిస్తోంది.
అమరావతి రైతులు , ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా బిల్లులు చెల్లించడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుతో 26 వేల మందికి లబ్ధి చేకూరింది. వివిధ వర్గాలకు 2025 జనవరిలోనే ఇప్పటి వరకు సుమారు రూ. 8 వేల కోట్ల చెల్లింపులు చేసింది.
పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్ల, ఉద్యోగులకు చెల్లింపుల కింద రూ. 1,300 కోట్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బిల్లు కోసం రూ. 788 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిల చెల్లింపులతో ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది.