మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ లో ఒక్కో ఘాట్ కు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. గంగ, యమున, అదృశ్య సరస్వతి మూడు నదులు కలిసిన చోటునే త్రివేణీ సంగమంగా పిలుస్తారు.
మహా కుంభమేళా లో సంగమ ఘాట్ కీలకం. ఇక్కడే మూడు నదుల సంగమం జరిగింది. ఈ ఘాట్‌లో స్నానం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.
కేదార్ ఘాట్ ను శివుడి ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించారు. ఇక్కడ పవిత్ర స్నానం చేసిన తరువాత మహాశివుడిని పూజిస్తారు.హండీ ఫోడ్ ఘాట్ పురాతన ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలలతో కూడిన అందమైన నదీ దృశ్యాన్ని ఇక్కడి నుంచి తిలకించవచ్చు.
ఇక దశాశ్వమేధ ఘాట్ ప్రస్తావన పౌరాణిక గాథలలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మ దేవుడు స్వయంగా 10 అశ్వమేధ యాగాలు చేశాడని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడే గంగా హారతితో పాటు పూజలు నిర్వహిస్తున్నారు.