మకర సంక్రాంతి కావడంతో త్రివేణీ సంగమానికి పోటెత్తిన భక్తులు
ప్రయాగరాజ్ కు భక్తులు పోటెత్తారు.మకర సంక్రాంతి సందర్భంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానాల ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాలో భాగంగా ఈ రోజు చేసే స్నానాన్ని అమృత స్నాన్ అంటారు. మంగళవారం ఉదయం 8.30 గంటల కే కోటి మంది త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.
తొలుత అఖాడా వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని ఆచరించారు.నాగ సాధువులను మహాశివుని అనుచరులుగా పరిగణించి వారికి ముందుగా ఈ స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన తర్వాత సామాన్యులు స్నానం ఆచరించారు.
పురాణాల ప్రకారం సముద్ర మథనం నుంచి అమృత భాండాగారం ఉద్భవించిన తర్వాత దేవతలు, రాక్షసులు ఒకరితో ఒకరు తగదాపడ్డారు. ఆ సమయంలో జరిగిన పోరాటంలో నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్,నాసిక్ లో పడినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఇక్కడ మహా కుంభమేళా నిర్వహిస్తారు.