భారత రక్షణ రంగం మరో మైలురాయిని చేరుకుంది. ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం పోఖ్రాన్‌లో ఇవాళ ఉదయం నాగ్ మార్క్ 2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిసైల్ అత్యంత కచ్ఛితత్వంతో యుద్ధ ట్యాంక్‌లను ధ్వంసం చేయగలదు. మూడుసార్లు విజయవంతంగా లక్ష్యాలను విధ్వంసం చేసిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
నాగ్ మార్క్ క్షిపణి వేగాలను కూడా నిర్ధరించారు. దీని క్యారియర్ వెర్షన్ 2ని కూడా పరీక్షించారు. క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో సైన్యంలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. నాగ్ ఆయుధ వ్యవస్థను త్వరలో భారత రక్షణ వ్యవస్థలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది.