Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులపై పూలవాన

Phaneendra by Phaneendra
Jan 14, 2025, 10:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో భాగంగా సుమారు కోటిమంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణీ సంగమంలో ఆదివారం మొదటి షాహీ స్నాన్, పుష్య పూర్ణిమ పవిత్ర స్నానం ఆచరించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంగమస్నానం ఆచరించిన భక్తులపై పుష్పవృష్టి కురిపించింది. ప్రయాగరాజ్‌లోని అన్ని ఘాట్లలోనూ, అన్ని అఖాడాల దగ్గరా స్నానాలు చేసిన భక్తుల మీద హెలికాప్టర్ ద్వారా పూలవాన కురిపించారు.

గగనతలం నుంచి గులాబి రేకలు వర్షధారల్లా జాలువారుతుంటే భక్తులు ఆనందాశ్చర్యాల్లో మునిగితేలారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ విభాగం పుష్పవర్షానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాలో ప్రధానమైన నాలుగు షాహీస్నాన్ రోజుల్లో త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించే భక్తులపై గులాబి పూలరెక్కలను వర్షంగా కురిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది.

ప్రతీ పవిత్ర స్నానం రోజునా 20 క్వింటాళ్ళ పూలను వర్షంగా కురిపించాలని ప్రణాళిక రచించారు. అందులో భాగంగా, కుంభమేళా మొదటి రోజు అయిన పుష్య పూర్ణిమ నాడు మొదటి పవిత్ర స్నానం ఆచరించిన భక్తుల మీద గులాబి రేకుల వాన కురిపించారు. ఊహించని ఆ పుష్పవృష్టితో భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. భక్తిపారవశ్యంతో జై శ్రీరామ్ నినాదాలు చేసారు.

ఒక వైపు హెలికాప్టర్లతో పూలు కురుస్తుండగా, మరోవైపు యూపీ సర్కారు పటిష్ట భద్రతా యేర్పాట్లు చేసింది. కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భక్తులందరూ సురక్షితంగా ఉండేందుకు భద్రతా బలగాలను మోహరించింది. స్నానఘట్టాలు, అఖాడాలు సహా ప్రయాగరాజ్ అంతటా పోలీసులు, భద్రతా బలగాలు డేగకన్నులతో కాపలా కాస్తున్నాయి.

Tags: Flower ShowersMahakumbh 2025Paush Purnima SnanPrayagrajSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.