మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పరశురామ్ కల్యాణ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. కనీసం నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ కుటుంబాలకు లక్ష నజరానా ఇస్తామని బోర్డు ప్రకటించింది.
భోపాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు చైర్మన్ పండిట్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు. తాను పదవిలో నుంచి దిగిపోయినా ఈ నిర్ణయం ప్రకారం నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ మధ్యకాలంలో యువత ఒకరితోనే ఆపేస్తున్నారని, దీంతో బ్రాహ్మణుల సంఖ్య దారుణంగా తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని దశాబ్దాల తరవాత బ్రాహ్మణ కమ్యూనిటీ అంతరించిపోయే దశకు చేరే ప్రమాదముందని రాజోరియా అభిప్రాయపడ్డారు.