తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. దీంతో ఆ మార్గంలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం ఘటన విషయం తెలియగానే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సును పక్కకు తీసి రోడ్డుపై ట్రాఫిక్ సరి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బస్సులోని ప్రయాణీకులను తిరుపతికి చేర్చారు. వారిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమిక విచారణలో తేలింది.