ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం బద్దలు కొట్టి రూ.18 లక్షలు కాజేసిన విషయం సోమవారం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి ఈ దొంగతనం జరిగిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.
ఆదివారం రాత్రి కొందరు దుండగులు పిట్లంలోని ఓ వెల్డింగ్ షాపు వద్ద గ్యాస్ కట్టర్ దొంగిలించి ఎస్బిఐ ఏటీఎం కట్ చేశారని పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి ఎవరూ లేకపోవడంతో ఉదయం దొంగతనం విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీ వీడియోలు పరిశీలించిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దొంగల కోసం వేట మొదలు పెట్టారు.