మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ , మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంది. మొదటి వన్డేలో గెలిచిన భారత్, రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్, ఐర్లాండ్ పై 116 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారత మహిళల క్రికెట్ వన్డే విభాగంలో ఈ స్కోరే అత్యధికం. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 254 పరుగులు చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ధ్వయం తొలి వికెట్‌కు 156 పరుగులు చేశారు. జట్టు స్కోర్ 156 వద్ద ఉన్నప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఓడారు. స్మృతి మంధాన (73), ప్రతీకా రావల్ (67) పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతంగా ఆడారు. హర్లీన్ డియోల్ 84 బంతుల్లో 89 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 91 బంతుల్లో 102 పరుగులు చేసింది. జెమీమా కెరీర్లో మొదటి సెంచరీ సాధించింది. రిచా ఘోష్ (10) విఫలమవ్వగా మ్యాచ్ ముగిసే సమయానికి తేజల్( 2), సయాలీ( 2) క్రీజులో ఉన్నారు.
ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా, కెల్లీ చెరో రెండు వికెట్లు తీయగా డెంప్సీ ఒక వికెట్ తీశారు.
ఐరాండ్ల్ 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఓపెనర్ గాబా లూయీస్ 19 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసింది. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ (38) ను రెండో వికెట్ గా దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. దీంతో 87 పరుగులు వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ నష్టపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగని రైలీ, 113 బంతుల్లో 80 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగింది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగినఐరా ఒర్లా(3) ను ప్రియా మిశ్రా ఔట్ చేసింది. లారా డెలానీ 36 బంతుల్లో 37 పరుగులు చేసింది. ఆ తర్వాత దిప్తీ శర్మ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరింది. దీంతో 188 పరుగుల వద్ద ఐర్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆర్లెన్ కెల్లీ (19)కూడా దీప్తి శర్మ బౌలింగ్ లోనే ఔట్ అయ్యారు. అవా (11) విఫలం కాగా, మ్యాచ్ ముగిసే సమయానికి లె పాల్(27), జార్జియా(6) పరుగలతో క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, ప్రియ మిశ్రా రెండు, సయాలి,తితాస్ చెరొక వికెట్ తీశారు.