157 బంతుల్లో 346 పరుగులు
42 ఫోర్లు, 16 సిక్సర్లు.. స్రయిక్ రేట్ 220.38
మహిళల క్రికెట్ లో సంచలనం నమోదైంది. అండర్-19 మహిళల వన్డే కప్ విభాగంలో 14 ఏళ్ళ ముంబై ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో క్రికెటర్ ఐరా జాదవ్ ఈ ఘనత సాధించింది. ఐరా 157 బంతులు ఎదుర్కొని 346 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండగా,స్ట్రయిక్ రేట్‌తో 220.38గా ఉంది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లో అయినా ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐరా జాదవ్ ఈ ఘనత సాధించి మొట్టమొదటి భారతీయురాలు కావడం మరో విశేషం.
మహిళల అండర్-19 విభాగంలో ఐరా జదావ్‌కు ముందు మరో నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. స్మృతి మంధన , రాఘ్వి బిస్త్, జెమీమా రోడ్రిగెజ్, సనికా ఛాల్కే డబుల్ సెంచరీలు చేశారు.
ముంబై, మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐరా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. హర్లీ గాలా కూడా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.
ఇటీవల జరిగిన మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా ఐరాను కొనుగోలు చేయలేదు.