తెలుగు సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హాటల్ కూల్చివేత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు ధిక్కరించడంపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు ధిక్కరించడంతో దగ్గుబాటి సురేశ్ బాబు ఏ1, దగ్గుబాటి వెంకటేశ్ ఏ2, దగ్గుబాటి రానా ఏ3, దగ్గుబాటి అభిరామ్ ఏ4లుగా కేసులో నమోదు చేశారు. వారిపై బీఎన్ఎస్ 448, 452, 458, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఫిల్మ్‌నగర్‌లో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబానికి చెందిన భవనాన్ని దక్కన్ కిచెన్ హోటల్‌కు లీజుకు ఇచ్చారు. హోటల్ ఖాళీ చేయించే వ్యవహారంలో గొడవలు చోటు చేసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాలను దగ్గుబాటి కుటుంబ సభ్యులు ధిక్కరించడంతో వారిపై మరో కేసు నమోదైంది.