స్వామి వివేకానంద అనగానే అమెరికాలోని షికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటులో చేసిన ప్రసంగం గుర్తొస్తుంది. అది కాకుండా ఆయన చేసిన మరో గొప్ప ప్రసంగం ‘‘ఈ ప్రపంచపు గొప్ప గురువులు’’. 1900 సంవత్సరం ఫిబ్రవరి 3న కాలిఫోర్నియా పసాడెనాలోని షేక్‌స్పియర్ క్లబ్‌లో చేసిన ఆ ప్రసంగంలో వివేకానంద దైవదూతల ఆవశ్యకత, మతంలో వారి ప్రాధాన్యం అన్న అంశం గురించి వివరించారు.
‘మా ప్రవక్తే నిజమైన ప్రవక్త అనడం సరికాదు’:
వివేకానంద తన ప్రసంగంలో ఇలా చెప్పారు ‘‘మీలో కొందరు సత్యాన్ని, దైవత్వాన్ని, దైవాన్ని ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రవక్తలోనే చూడగలం, మరే ఇతర ప్రవక్తలోనూ ఉండదు అని భావిస్తారు. అలా అనుకుంటే దైవత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే. మీరు కేవలం పదాలను దిగమింగి మిమ్మల్ని మీరు ఒక జాతిగా భావిస్తున్నారు, ఒక రాజకీయ పార్టీకి అభిమానులు ఎలా ఉంటారో అలా ఒక అభిప్రాయానికి అభిమానులుగా ఉంటున్నారు. అంతే తప్ప అది మతం కాదు.’’
ఈ ప్రపంచపు సత్యాన్ని ఏ ఒక్క ప్రవక్తో రూపొందించలేదు అని వివేకానంద వివరించారు. ‘‘ప్రతీ ప్రవక్తకూ ఈ ప్రపంచంలో పూర్తి చేయవలసిన ఒక లక్ష్యం ఉంటుంది. ఈ దూతలందరూ కలిసి ప్రజలకు భగవంతుడి సందేశాన్ని అందజేస్తున్నారు. కాబట్టి, ‘నా ప్రవక్త ఒక్కరే నిజమైన ప్రవక్త’ అనే ఏ వ్యక్తీ సరికాదు. అతనికి మతం గురించి అఆలు కూడా తెలియవు. మతం అంటే మాటలో, సిద్ధాంతమో, మేధోపరమైన ఒప్పుకోలో కాదు. మతం అంటే మన హృదయాంతరాళంలో భగవంతుణ్ణి తెలుసుకోవడం, దైవాన్ని తాకడం, ఈ విశ్వ తేజస్సులో నేనూ ఒక రేణువును అని తెలుసుకోవడమే’’ అని వివేకానంద స్పష్టం చేసారు.
‘‘మనందరం ఒక తీర్మానం చేసుకుందాం. ‘నేనూ ఒక ప్రవక్తను అవుతాను. జ్ఞానజ్యోతి సందేశాన్ని వ్యాపింపజేస్తాను. నేను దైవసంతానాన్ని, కాదుకాదు, నేనే దైవాన్ని అవుతాను’ అని ఈ క్షణంలో మనం భావిద్దాం’’ అని స్వామి చెప్పారు.
‘ఇస్లామిక్ బోధనలు చెప్పినట్టు కాకుండా, మనం వ్యక్తిత్వాలను ఆరాధిస్తాం’:
ప్రతీ మతమూ ప్రవక్తలను ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది. కానీ వారందరి కంటె ముస్లిములు వేరు. మనుషులుగా మనం మనకంటె ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవారిని గౌరవించాలి. ‘‘మహమ్మదీయులు మొదటినుంచీ అటువంటి ఆరాధనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రవక్తలను, దైవదూతలను గౌరవించి పూజించడంతో వారికి ఏ సంబంధమూ లేదు. ప్రవక్తలకు వారు నివాళులు అర్పించకూడదు. కానీ ఆచరణలో చూస్తే ఒక ప్రవక్తకు బదులు వారు వేలాది సాధువులను పూజిస్తున్నారు. మనం వాస్తవాలకు విరుద్ధంగా వెళ్ళలేం. మనం వ్యక్తిత్వాలను ఆరాధించి తీరతాం. అది మంచిదే’’ అని వివేకానంద చెప్పారు.
‘కొందరు ముస్లిముల విశ్వాసాల వల్ల పొంచివున్న ప్రమాదాలు’:
వివేకానంద తన ప్రసంగంలో కొందరు ముస్లిముల విశ్వాసాల వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ‘‘ఈ తరహాలో కొందరు ముస్లిములు చాలా నాటుగా ఉంటారు, జాతుల విభజన కోసం పట్టుపడుతుంటారు. వాళ్ళ నినాదం ఒకటే. ‘ఈ ప్రపంచంలో ఒక్కడే దేవుడు ఉన్నాడు, అతని ప్రవక్త మహమ్మదే’’ అని వివేకానంద స్పష్టంగా చెప్పారు.
అటువంటి నమ్మకాలు, అవిశ్వాసుల జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైన మార్పు తీసుకొచ్చాయి. ‘‘ఇస్లాంకు వెలుపల ఉన్నవారంతా చెడ్డవారు కాదు వారిని వెంటనే విధ్వంసం చేయనక్కర లేదు. ఇస్లాంను నమ్మని వారు అందరినీ చంపేయాలి. ఆ మతానికి సంబంధించని దేన్నయినా ధ్వంసం చేసేయాలి. మిగతా అన్ని గ్రంథాలనూ తగులబెట్టేయాలి. పసిఫిక్ నుంచి అట్లాంటిక్ వరకూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిముల నరనరాల్లో ఐదువందల యేళ్ళుగా అదే భావం పాతుకుపోయింది. అదే ఇస్లాం అంటే’’ అని వివేకానంద చెప్పుకొచ్చారు.
స్వామి వివేకానంద నిజమైన దార్శనికులు. ఇస్లాంను నమ్మని ప్రతీ వ్యక్తినీ చంపేయాలని కొందరు ముస్లిములు భావిస్తుండడం 21వ శతాబ్దంలో నిజమైంది.
ఇస్లాంలో సమానత్వపు భావనను విశ్వసించిన స్వామి:
మహమ్మదీయ మతం రక్తపాతం ద్వారా వ్యాప్తి చెందినప్పటికీ, దానిలో ఏ మంచీ లేకపోతే ఇంతకాలం పాటు మనుగడలో ఉండగలిగేది కాదని వివేకానంద భావించారు. ‘‘ఇస్లాం బోధనల్లో మంచి అన్నదే లేకపోతే ఆ మతం ఎలా జీవించగలిగింది? ఆ మతంలోనూ మంచి ఉంది. మహమ్మద్ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్నీ బోధించిన ప్రవక్త. ముస్లిములందరూ సమానులు, సోదరతుల్యులూ అని ఆయన ప్రచారం చేసారు’’ అన్నారు వివేకానంద.
మహమ్మద్ ప్రవక్త జీవితం నుంచి నేర్చుకోడానికి ఎన్నో విషయాలున్నాయని స్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ప్రవక్తా, ప్రతీ దైవదూతా ఒక నిర్దిష్టమైన సందేశంతో ఈ భూమ్మీదకు వచ్చారు. ఆ సందేశాన్ని మీరు మొదటిసారి విన్నప్పుడు, ఆ తర్వాత వారి జీవితాన్ని చూసినప్పుడు, వారి మొత్తం జీవితం ఆ సందేశానికి నిదర్శనంలా నిలుస్తుందని మీరు తెలుసుకోగలుగుతారు’’ అని చెప్పారు. ‘‘మహమ్మద్ ప్రవక్త తన జీవితం ద్వారా ముస్లిములు అందరూ సమానులు, సోదరతుల్యులు అని చూపించారు. జాతి, కులం, మతం, రంగు, లింగం గురించిన ప్రశ్నే లేదు. టర్కీ సుల్తాను ఆఫ్రికా సంత నుంచి నీగ్రోని కొని, సంకెళ్లతో కట్టి టర్కీకి తీసుకెళ్ళి ఉండవచ్చు. కానీ అతను ముస్లి అయిఉంటే, కొన్ని సామర్థ్యాలు కలిగి ఉంటే ఆ నీగ్రో ఆ సుల్తాను కూతురిని పెళ్ళి చేసుకోగలడు.’’
దాన్ని కొందరు హిందువుల ఛాందసవాదంతో పోలుస్తూ స్వామి వివేకానంద స్పష్టంగా ఇలా చెప్పారు. ‘‘మన వేదాంతపు గొప్పతనాన్ని అలా ఉండనియ్యండి, ఆచరణలో మన బలహీనతలను గమనించండి. మిగతావారితో పోలిస్తే ముస్లిములలో మీరు ఆ గొప్పదనాన్ని చూడవచ్చు. జాతి, రంగుతో సంబంధం లేకుండా వారు సమానత్వాన్ని కచ్చితంగా పాటిస్తారు’’.
అయితే వివేకానంద గ్రహించలేకపోయిన విషయం ఏంటంటే ఆయన తర్వాత మరికొన్నేళ్ళకే, ఇస్లాంలో సమానత్వం అనే భావన ఉత్త డొల్ల అని తేలిపోయింది. ఇరాక్‌లో, సౌదీ అరేబియాలో సున్నీలు-షియాలు కొట్టుకుంటున్నారు, పాకిస్తాన్‌లో అహ్మదీయులను అసలు ముస్లిములుగానే పరిగణించరు. అక్కడ హజారాలను సున్నీలు తెగనరుకుతున్నారు.