రోజుకు కోటి మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుగులోనూ తెలుసుకోవచ్చు. సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకునేలా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలుగుతో పాటు 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు HI (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
kumbh sahayak app ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవచ్చు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా కోసం 50 రోజుల్లో మొత్తంగా 10,000 సాధారణ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. విజయవాడ, సికింద్రాబాద్‌ల నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి రైల్వేశాఖ రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఒకే ఒక్క విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.