విశాఖ సికింద్రాబాద్ వందేభారత్‌కు రోజు రోజుకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోంది. దీంతో 8 కోచ్‌లతో తిరుగుతోన్న వందేభారత్‌కు అదనంగా మరో 8 కోచ్‌లు అనుసంధానం చేశారు. దీంతో సీట్ల సంఖ్య రెట్టింపు కానుంది. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కోచ్ ఒకటి, సాధారణ కోచ్‌లు ఉండగా, వాటిని రెట్టింపు చేయనున్నారు. కోచ్‌లు పెంచడంతో దాదాపు 1150 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.ఇక నుంచి 16 కోచ్‌లతో వందే భారత్ నడవనుంది.
విశాఖ సికింద్రాబాద్ మధ్య వారానికి ఆరు రోజులు తిరుగుతోన్న వందేభారత్ 95 శాతం ఆక్యుఫెన్సీతో నడుస్తోంది. పండుగ పర్యదినాల సమాయాల్లో టికెట్లు లభించడం లేదని ప్రయాణీకులు చెబుతున్నారు. కోచ్‌లను రెట్టింపు చేయడంతో డిమాండు తట్టుకునే విధంగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి రైల్వే అధికారులు చెబుతున్నారు.