ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఫ్యాకల్టీలకు సంబంధించిన కేటగిరీ 2 పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని ఉస్మానియా వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23 వరకు తమ పేర్లు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.2000 అపరాధ రుసుంతో మార్చి 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇతర వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో పొందుపరిచామన్నారు.
దూరవిద్య డిగ్రీ సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలు
ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలు ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని సంవత్సరాల సప్లమెంటరీ ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పీజీ కోర్సుల వన్‌టైం చాన్స్ పరీక్ష తేదీల ఖరారు
యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సులు వన్‌టైం చాన్స్ పరీక్షలు వచ్చే నెల 5నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.