ఓ డ్రైవర్ 7 కిలోల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. ఈ ఘటన ఏపీ, తెలంగాణ సరిహద్దులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
హైదరాబాద్‌లోని శ్యాం బాబా జ్యుయలరీ దుకాణం నుంచి విజయవాడలోని ఓ జ్యుయలరీ దుకాణానికి ఆభరణాలను తరలించే పనిని జితేంద్ర అనే వ్యక్తికి అప్పగించారు. ఈ క్రమంలో డ్రైవర్ జితేంద్ర బంగారంతో పరారయ్యాడు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు..
మధ్యప్రదేశ్‌కు చెందిన జితేంద్రతోపాటు మరో ఇద్దరికి బంగారు ఆభరణాలు విజయవాడలో అప్పగించే పనిని అప్పగించారు. డ్రైవర్ జితేంద్రతోపాటు ఇద్దరిని రక్షణగా పంపారు. వారు జగ్గయ్యపేట వద్ద టీ తాగేందుకు ఆగిన సమయంలో ఇద్దరి కళ్లుగప్పి డ్రైవర్ జితేంద్ర పరారయ్యాడు. గమనించిన ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాహనాన్ని నందిగామ మండలం మునగచర్ల వద్ద ఆపేసి బంగారంతో జితేంద్ర పరారయ్యాడు.సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేశాడు. డ్రైవర్ జితేంద్ర హైదరాబాద్‌లో నివాసం ఉంటే ఇంటి వద్ద తనిఖీ చేయగా అప్పటికే ఖాళీ చేసినట్లు గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం జితేంద్ర 7 కిలోల బంగారు ఆభరణాలు కొట్టేసినట్లు ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.