తిరుమల శ్రీవారి పరకామణికి చెందిన బంగారం చోరీ చేసేందుకు యత్నించిన బ్యాంకు ఉద్యోగిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుపతిలోని ఓ బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను తరలించే ట్రాలీలో వ్యర్థాల్లో వంద గ్రాముల బంగారం దాచి తరలించే ప్రయత్నం చేయగా విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బంగారం పట్టుబడటంతో పెంచలయ్యపై కేసు నమోదు చేశారు.
అనేక సార్లు పెంచలయ్య ఇదే తరహాలో బంగారం తరలించాడా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుమల శ్రీవారికి వచ్చిన బంగారు ఆభరణాల కానుకలను కరిగించి బంగారం బిస్కెట్ల రూపంలోకి మారుస్తారు. అలా వచ్చిన బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచడంతోపాటు, పరకామణిలో నిల్వచేస్తారు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తారు. ఇలా బ్యాంకు ఉద్యోగులు ఆడిట్ చేసే సమయంలో బంగారం కాజేస్తూ పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది.