సంక్రాంతి రద్దీ తో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రైవేటు వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. కాలేజీలు, స్కూళ్ళ బస్సుల ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చనున్నారు.
ఆంధ్రుల అతిపెద్ద పండుగైన సంక్రాంతికి నగరాల నుంచి పల్లెలకు వెళ్ళేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిశాయి. దీంతో ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ళ బస్సులను రద్దీ రూట్లలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజయవాడలో మీడియాతో చిట్ చాట్ అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడపనున్నారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు సొంతవాహనాల్లో సొంతూళ్ళకు బయలు దేరారు. దీంతో పలు టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.