సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారంతం కావడంతో సరదాగా గడిపేందుకు ఏడుగురు స్నేహితులు హైదరాబాద్ నుంచి మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ వద్దకు వచ్చారు. ఈత కోసం డ్యామ్ లో కి దిగగా ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. ధనుష్, లోహిత్ అన్నదమ్ములు.