ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదా ఉన్న వ్యక్తులకు నెలకు రూ. లక్షల జీతం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
వేతనంతో పాటు ఆఫీస్ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్ టైమ్ గ్రాంట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులు వ్యక్తిగత సహాయ సిబ్బందిని నియమించుకునేందుకు అలవెన్స్ ఇతర సౌకర్యాల కోసం మరో రూ. 2.50 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో కేబినెట్ హోదాలో ఉన్నవారికి నెలకు మొత్తం రూ. 4.50లక్షలు అందనున్నాయి.