ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఏఐ సదస్సు లో మోదీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధికారికంగా వెల్లడించారు. అమెరికా, చైనా, భారత్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ సదస్సులో సమాలోచనలు చేయనున్నాయని తెలిపారు.
గత ఏడాది నవంబర్ 18న మాక్రాన్, మోదీ సమావేశం అయ్యారు. బ్రెజిల్ లోని రియో డీ జనేరో వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఇరువురు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. అలాగే 2023లో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2024లో భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మోదీ తాజా పర్యటనలో ఏఐ సదస్సు లో పాల్గొనడంతో పాటు సైనిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.