ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. వివిధ ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసిన 8 నోటిపికేష్లనకు సంబంధించి ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయని ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ ఉంటుందని పేర్కొంది.
అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్ , అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్టు , అసిస్టెంట్ ఎలిక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏఎస్వో, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
రాత పరీక్షల కేంద్రాలను విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎంపిక చేయనున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష జనవరి 5న జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేశారు.