కేరళలో దారుణం వెలుగు చూసింది. తనపై ఐదేళ్లుగా 60 మంది లైంగిక దాడికి ఒడిగట్టారని ఓ క్రీడాకారిణి ఫిర్యాదు చేసింది. తనను బెదిరించడం వల్లే ఇన్నాళ్లూ భరించినట్లు చెప్పుకొచ్చింది. పతానంతిట్టకు చెందిన క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 60 మందిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఛైల్డ్ వెల్ఫేర్ హాస్టళ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పతానంతిట్టకు చెందిన అథెట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదేళ్ల కిందట అంటే తనకు 13 ఏళ్ళ వయసులో ఓ వ్యక్తి సమీపంలో అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆ తరవాత తనపై 60 మంది పలు సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది. వీరిలో చాలా మంది తోటి క్రీడాకారులని పోలీసులు గుర్తించారు.
బాలిక ఫిర్యాదు మేరకు 60 మందిపై ఫోక్సో కేసు నమోదైంది. వారిలో 40 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి వ్యవహారం కేరళ రాజకీయాలను కుదిపేస్తోంది. పోలీసుల విచారణ తరవాత మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.