పంజాబ్లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగీ అనుమానాస్పదంగా చనిపోయారు. శుక్రవారం రాత్రి ఆయన తలలో నుంచి రెండు బులెట్లు దూసుకెళ్లాయని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ బులెట్లు దూసుకెళ్లాయా, ఏదైనా గొడవల వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు డీసీపీ కుశాల్ సింగ్ వెల్లడించారు. ప్రమాదంవల్లే జరిగిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2022 నుంచి రెండు సార్లు ఆప్ నుంచి లూథాయానా వెస్ట్ ఎమ్మెల్యేగా గురుప్రీత్ గోగీ గెలిచారు. అతనికి లైసెన్సు కలిగిన తుపాకీ ఉందని పోలీసులు తెలిపారు. రాజకీయాల్లో కొందరు శత్రువులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే సెటిల్మెంట్లు చేసే వ్యవహారంలో జరిగిన కాల్పుల్లో గుర్ప్రీత్ చనిపోయాడంటూ స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు విచారణ తరవాత వెలుగులోకి రానున్నాయి.