గత ఏడాది పుష్య శుక్ల ద్వాదశి నాడు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ
ప్రతీ ఏడాది కూర్మ ద్వాదశి నాడే వార్షికోత్సవం
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో ఆలయ వార్షికోత్సవాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాల సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రాంత ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మీడియాకు వెల్లడించారు.
తిథి ప్రకారం వార్షికోత్సవాన్ని జనవరి 11న పెద్ద ఎత్తు నిర్వహంచున్నట్టు చంపత్ రాయ్ వివరించారు. 2024 జనవరి 22న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి రోజున ఆలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. అయితే అదే తిథి ఈ ఏడాది పది రోజులు ముందుగా వచ్చింది.
ఇక నుంచి ప్రతీ ఏడాది పుష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట ఉత్సవం జరుపుకోవాలని పండితులు తీర్మానించారు.
వైకుంఠ ఏకాదశి మరునాడే ద్వాదశి తిథి వస్తుంది. దీనినే కూర్మద్వాదశి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ తిథి నాడు వైష్ణవ క్షేత్రాల్లో చక్రస్నానం ఘట్టం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
అయోధ్య లో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ప్రతీ రోజు దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు.