మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్, భారత జట్లు తలపడుతున్నాయి. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ రాజ్కోట్ లోని నిరంజన్ షా మైదానం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది.
ఐర్లాండ్ ఓపెనర్లలో సారా ఫోర్బ్స్ (9) తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు పంపిన భారత బౌలర్లకు మరో ఓపెనర్ గాబా లూయీస్ మాత్రం చుక్కలు చూపింది. గాబా, 129 బంతులు ఆడి 92 పరుగులు చేసింది. ఆరో వికెట్ గా జట్టు స్కోర్ 194 వద్ద ఉన్నప్పుడు దీప్తి శర్మ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది.
ఉనా రేమండ్( 5) రన్ ఔట్ కాగా , ఒర్లా(9)ను క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. లారా డెలాని ని ప్రియా మిశ్రా డకౌట్ చేసింది. , లె పాల్ 73 బంతుల్లో 59 పరుగులు చేసి రన్ ఔట్ కావడంతో ఐర్లాండ్ ఐదో వికెట్ నష్టపోయింది. రైలీ(15), ఆర్లెన్ కెల్లీ(28), జార్జీనా(6*) పరుగులు చేయడంతో ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 238 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీయగా తితా సాధు, దీప్తి శర్మ, సయాలి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.