ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ అతిథిగా పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. రాజకీయాలు, నాయకత్వంపై పలు ప్రశ్నలకు మోదీ సమాధానం ఇచ్చారు.