ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కీలక సంస్కరణలు అమలు కాబోతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల పాఠశాలలు ఉండబోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం రద్దు చేయనుంది. కొత్తగా తీసుకురానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని ఉన్నతీకరించడం కానీ, ప్రాథమిక బడులుగా మార్చడం కానీ చేయనున్నారు.
ఇంటర్మీడియెట్‌తో కలిపి ఏర్పాటు చేసిన హైస్కూలు ప్లస్ వ్యవస్థను కూడా తీసేసి, ఇంటర్‌ను ఇంటర్మీడియెట్ విద్యాశాఖకు అప్పగించనుంది.2024 డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల పాఠశాలల విధానాన్ని అమలు చేయనుది.
ఐదు రకాల స్కూళ్లు ఇవే
పూర్వ ప్రాథమిక విద్య: 1, 2 (ఎల్కేజీ, యూకేజీ) బోధించే అంగన్వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య: 1,2 తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1,2తోపాటు 1 నుంచి 5 తరగతులు ఉండేవాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా వ్యవహరించనున్నారు.
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌కు ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు.
6 నుంచి 10 వరకు తరగతులు ఉండే వాటిని ఉన్నత పాఠశాలలుగా వ్యవహరిస్తారు.