దెహ్రాదూన్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(RIMC)లో 8వ తరగతి ప్రవేశాలకు ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
జనవరి-2026 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2026 జనవరి 1 నాటికి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థుల వయస్సు 2026 జనవరి 1 నాటికి పదకొండున్నర ఏళ్ళకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. నోటిఫికేషన్ మేరకు విద్యార్థులు 02.01.2013 – 01.07.2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.
రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ పరీక్షలు 1 జూన్ 2025 న నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను వైవా వోస్, ఇంటలిజెన్స్, పర్సనాలటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తర్వాత విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. ద్వారా ఎంపిక చేస్తారు. మార్చి 31,2025 లోపు విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.