ఛత్తీస్‌గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరిధిలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మూడు దళాల భద్రతా సిబ్బందితో కూడిన జాయింట్ టీమ్ యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపడుతోందన్నారు. దీంతో కాల్పులు మొదలయ్యాయని వివరించారు.సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ నుంచి వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నక్సల్స్ కార్యకలాపాలను భద్రతా దళాలు కట్టడి చేశాయి. పోలీసుల చర్యలకు ప్రతీకారంగా మావోయిస్టులు ఇటీవల భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు చనిపోయారు.
2026 నాటికి నక్సల్స్ రహిత్ భారత దేశాన్ని ఆవిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది.