పీఎం కిసాన్ సమ్మాన్’ పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కొత్త లబ్దిదారులు ‘రైతు గుర్తింపు ఐడీ’ని పొంది ఉండటం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సదరు గుర్తింపు ఐడీ తో రైతుకు సొంత భూమి ఉందో లేదో తెలుస్తుంది.
రైతు గుర్తింపు ఐడీ ఉంటేనే లబ్దిదారుల పేర్లను మాత్రమే పథకంలో నమోదు చేస్తామని కేంద్రం వివరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం… పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి నెలకు సగటున 2 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఈ పథకం కింద సాయం పొందాలంటే ‘ఫార్మర్స్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ విధానం ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రాగా మిగతా రాష్ట్రాల్లో కూడా తప్పనిసరి చేశారు.