అమెరికాను కార్చిచ్చు కలవరపెడుతోంది. లాస్ ఏంజలెస్‌లో హాలివుడ్ నటులు నివసించే ధనవంతుల ప్రాంతంలో ఇప్పటికే 2 వేల గృహాలు అగ్నికి అహుతి అయ్యాయి. మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీయడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి.
మారిబులో ప్రాంతంలోని బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కుమారుడి ఇళ్లు కూడా కాలిపోయిందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయం తనకు తెలియదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. సంపన్నులు నివసించే బేవర్లీ హిల్స్ ప్రాంతం నుంచి పలు ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. బైడెన్ నివాస ప్రాంతానికి కూతవేటు దూరంలో మంటలు కనిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు.
అమెరికాలో ఓ వైపు మంచు తుఫానుతో 7 కోట్ల మంది వణికిపోతుండగా మరోవైపు కార్చిచ్చు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లాస్‌ఏంజలస్ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. వేలాది మంది కార్లలో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. పొగతో రోడ్లు కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. మంటలు అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.