మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతంలో అర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని ఏళ్ళ తరబడి లైంగికంగా దోచుకుంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని ఇస్లాంలోకి మతం మారాలంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఇటీవల నిర్బంధించినప్పుడు ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.
పోలీస్ రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు పాతికేళ్ళ యువతి. నిందితుడు అర్మాన్ ఖాన్ ఐదేళ్ళ క్రితం ఆమెకు సోషల్ మీడియా ద్వారా స్నేహితుడయ్యాడు. ఆమెను వ్యక్తిగతంగా కలవాలంటూ పిలిచాడు. అతను చెప్పిన చోటికి వెళ్ళిన ఆ యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సంఘటనను వీడియో తీసాడు. దాన్ని అడ్డం పెట్టుకుని అప్పటినుంచీ ఆ యువతిని బ్లాక్‌మెయిల్ చేయసాగాడు.
అప్పటినుంచీ బాధితురాలిని తరచుగా తన వద్దకు పిలిపించుకుంటూ అర్మాన్ ఖాన్ ఆమెను లైంగికంగా దోపిడీ చేస్తూన్నాడు. దానికి తోడు ఆమెను ఇస్లాంలోకి మతం మారాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దానికి అభ్యంతరం చెప్పడంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా తన మామతో జాహిద్ ఖాన్‌తో కలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు.
జనవరి 6న అర్మాన్‌ఖాన్ బాధిత యువతిని పిలిపించుకున్నాడు. తన దగ్గరకు వచ్చాక ఇస్లాంలోకి మతం మారాలంటూ బాగా ఒత్తిడి చేసాడు. ఆమెను గ్వాలియర్ రోడ్‌లో సముదన్ గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అర్మాన్ మామ జాహిద్ ఖాన్ వారితో చేరాడు. అర్మాన్, జాహిద్ ఇద్దరూ కలిసి ఆ యువతిని మతం మారాలని ఒత్తిడి చేసారు. మతం మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారు.
ప్రాణభయంతో యువతి వారినుంచి పారిపోడానికి ప్రయత్నించింది. ఎలాగోలా వారినుంచి తప్పించుకుని రోడ్డు మీదకు వచ్చేసింది. రహదారి మీద కనిపించిన వ్యక్తి సాయంతో పోలీసులకు ఫోన్ చేసింది. తక్షణం స్పందించిన పోలీసులు ఆమెను దబ్రా సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అర్మాన్ ఖాన్, జాహిద్ ఖాన్‌ల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు. అర్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసారు. జాహిద్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన ద్వారా హిందూ యువతులను లోబరుచుకుని, వారిని మతం మార్చడానికి ముస్లిములు చేస్తున్న ప్రయత్నాలు మరోసారి బైటపడ్డాయి.