మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం రేగింది. గూండాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఉంచే సెల్ వద్ద చైనా డ్రోన్‌ను గుర్తించిన రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అప్రమత్తమై డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.నిపుణుల పరీక్షలకు పంపించారు.
భోపాల్ సెంట్రల్ జైలులోని అండా బ్లాకులో ఉగ్రవాదులను ఖైదీ చేస్తుంటారు. ఈ బ్లాకులో 70 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులున్నారు.గణతంత్రదినోత్సవాలు సమీపిస్తోన్న వేళ చైనా డ్రోన్ గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. జైళ్ల శాఖ అధికారులు గుర్తించిన డ్రోన్‌లో లెన్స్ ఉన్నట్లు తేలింది. జైలు పరిసరాలను క్షణ్ణంగా పరిశీలించేందుకు డ్రోన్ వదిలినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను తప్పించే ప్రయత్నాల్లో భాగంగా జరిగిందా అనే దానిపై కూడా నిఘా వర్గాలు సమాచారం రాబడుతున్నాయి.
భోపాల్ జైలో చైనా డ్రోన్‌ను గుర్తించడంపై కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఓ వైపు గణతంత్ర దినోత్సవాలు సమీపించడం, మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్న వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.