తిరుమలలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. అందుకోసం రేపటి నుంచి తిరుపతి, తిరుమలలో రేపటి నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది.
భక్తులు నేటి సాయంత్రమే టికెట్ కౌంటర్ల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. , తిరుపతిలోని శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులు ఒకరినొకరు నెట్టుకున్నారు. తోపులాటలో పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు చనిపోగా వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు.
ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.