టీజీపీఎస్సీ కీలక నిర్ణయం వెల్లడించింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది.
ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామని తెలిపింది. కొత్త నోటిఫికేషన్లు జారీ చేసి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్ పేర్కొంది.
నేడు గ్రూప్-3 ‘కీ’ , రెండురోజుల్లో గ్రూప్-2 ‘కీ’ విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉందని, ఆ వేదికగా ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించనున్నట్టు చెప్పారు.