సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టులో షాక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు టికెట్ రేట్లను విడుదల రోజు నుంచి 14 రోజుల పాటు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అయితే టికెట్ రేట్లు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపు జరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
పిటిషన్ ను విచారించిన ఏపీ హై, గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాల టికెట్ రేట్ల పెంపు అనుమతిని 14 రోజుల నుంచి 10 రోజులకు కుదించింది.
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10న రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ విడుదల కాబోతున్నాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు