పిభ్రవరి నుంచి వారంలో మూడురోజులు ప్రజల్లో ఉంటానని వెల్లడి
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి నుంచి వారంలో మూడు రోజులపాటు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉఎమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్ ప్రతి వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేసి, ప్రతీ రోజు రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్కా అయితే ఇకపై జరిగేది మరో లెక్కా అన్నారు. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుందన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. రాజకీయాల్లో ఉండే నాయకులకు విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని అలాంటి వారికే విలువ ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేలండర్ మేరకు పథకాలు అమలు చేసి లబ్ధిదారులకు నగదు సాయం జమ చేశామన్నారు.