భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) కొత్త చైర్మెన్‌గా వీ నారాయణన్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14 న నారాయణన్ బాధ్యతలు చేపడతారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా నారాయణన్ సేవలందించనున్నారు.
లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్(LPSC) చీఫ్ గా ఉన్న నారాయణన్, రెండేళ్ళ పాటు ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో నారాయణన్, కీలక పాత్రధారిగా ఉన్నారు. ఇక డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగా సోమనాథ్ , జనవరి 14, 2022లో బాధ్యతలు చేపట్టారు. జీఎస్ఎల్వీ ఎంకే 3 వెహికల్‌కు చెందిన సీ25 క్రయోజనిక్ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. నారాయణన్ నేతృత్వంలోనే ఇస్రో బృందం విజయవంతంగా సీ25 స్టేజ్‌ను డెవలప్ చేసింది.
1984లో ఇస్రోలో చేరిన నారాయణన్ , క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నుంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు.