సంక్రాంతి పండగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ స్పష్టం చేశారు. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు మరో 3800 సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 2 వేలకుపైగా సర్వీసులు, బెంగళూరు నుంచి 400, విజయవాడ నుంచి 500 పైగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.
సంక్రాంతి పండుగకు నడిపే బస్సులో ప్రయాణీకులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ముందుగా రెండు వైపులా టికెట్ బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతికి నగరాల నుంచి దాదాపు 40 లక్షల మంది గ్రామాలకు ప్రయాణాలు చేస్తారని అంచనా. డిమాండుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని సంస్థ ఎండీ తెలిపారు.