గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని ప్రధాన కార్యాలయంతోపాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చినట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణలో ఫార్ములా ఈ రేసులోనూ గ్రీన్ కో సంస్థకు ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది.
ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థకు ఒప్పందం కుదరకముందే నిధులు చెల్లించిన కేసులో అప్పటి మంత్రి కేటీఆర్, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ వేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు ఏసీబీ జరిపిన సోదాల్లో విదేశాలకు నిధులు తరలించడంలో గ్రీన్ కో మూలాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అందుకే ఆ సంస్థ కార్యాయాలల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.