వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
దేశంలో పంచదార కనీస ధర పెరగనుంది. చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని యోచిస్తోందని కేంద్రం ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పంచదార ధర కిలోగ్రాముకు రూ. 31 గా ఉంది. 2019 ఫిబ్రవరి నుంచి కనీస విక్రయధర లో మార్పులేదు.
పంచదార ధర పెంచాలంటూ చక్కెర పరిశ్రమ యజమాన్యాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని కంపెనీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు.
చక్కెర కంపెనీల మనుగడ, లాభాల కోసం ధరను పెంచడం మినహా వేరే మార్గం లేదని చక్కెర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పంచదార కనీస విక్రయ ధరను పెంచితే సామాన్యుల నెలలవారీ ఖర్చు పై ప్రభావం చూపనుంది. కనీస విక్రయ ధర రూ.39.4, రూ.42కి కానీ పెంచాలని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్, ఇతర పరిశ్రమ సంఘాలు కోరుతున్నాయి.