భయాందోళనలో స్థానికులు
శ్రీశైలంలో చిరుత సంచారం తో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రీశైల డ్యామ్, ఆలయ పరిసరాల్లో తరుచూ సంచరిస్తున్న చిరుత మరోసారి పాతళగంగ సమీపంలోకి వచ్చింది. పాతాళగంగ మెట్లమార్గంలోని ఆలయ అర్చకస్వామి ఇంట్లోకి చొరబడి కాసేపు తచ్చాడింది.
చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చిరుత చొరబడింది. అనంతరం అక్కడే తచ్చాడి బయటకు వెళ్లింది.
చిరుత ఇంట్లోకి చొరబడిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. చిరుత కదలికల నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు.