విశాఖ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రేపు(జనవరి8) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
విశాఖపట్నంలోని పూడిమడక వద్ద NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ హైడ్రోజన్ హబ్‌కు బుధవారం సాయంత్రం 5.30గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం, అనకాపల్లి జిల్లా పరధిలోని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లాలో చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద చేపట్టనున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలకు ప్రధా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సభ ఉంటుంది. సభకు ముందు ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్‌షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు.
కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ రోజు సాయంత్రమే విశాఖ చేరుకుంటారని అధికార వర్గాల సమాచారం.