మన పొరుగు దేశం నేపాల్‌ను భూకంపం కుదిపేసింది. ఇవాళ ఉదయం సంభవించిన భూకంపంలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది. ఉదయం 6 గంటల 35 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాంలోనూ భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉంది. ప్రకంపణలు భారత్‌లో నమోదైనా నష్టం జరగలేదని తెలుస్తోంది.
2015లో భారీ భూకంపం నేపాల్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. నాడు సంభవించిన పెను భూకంపంలో 9 వేల మంది చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. అప్పట్లో 7.8 నమోదైంది.నేపాల్ భూకంపాల జోన్ 1లో ఉంది. హిమాలయాల భూకంప జోన్ పరిధిలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తాజాగా సంభవించిన భూకంపంలో మరణాలు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఆస్తి నష్టం వాటిల్లిందని, దాని వివరాలు ఇంకా అందాల్సి ఉంది. భూకంపం వివరాలు చైనా మీడియా సంస్థల ద్వారా అంతర్జాతీయ మీడియాకు అందాయి.