కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. లిబరల్ పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కొత్త నేతను ఎన్నుకునే వరకు తాత్కాలిక పదవిలో కొనసాగుతానని చెప్పారు. ట్రూడోను తప్పించి కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. దీంతో దాదాపు అరడజను మంది పేర్లు ప్రధాని పదవి రేసులో ముందుకు వచ్చాయి.
లిబరల్ పార్టీ నాయకులు క్రిస్టినా ఫ్రీలాండ్, డొమినిక్ లీ బ్లాంక్, మార్క్ కార్నీ, మెలనీ జోలీ, క్రిస్టీ క్లార్క్, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీతోపాటు భారత సంతతి నేతలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ కూడా రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిలో భారతి సంతతి నేత అనిత్ ఆనంద్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తమిళ మూలాలున్న అనితా ఆనంద్ ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్ విల్లే నుంచి ఎంపీగా గెలిచారు. ట్రూడో క్యాబినెట్లో చోటు సంపాదించారు. 2019 నుంచి రెండేళ్లపాటు ప్రజా సేవల మంత్రిగా సేవలందించారు. రెండేళ్ల నుంచి రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ప్రకటించారు. గత నెల మంత్రివర్గ పునర్వవవస్థీకరణ తరవతా రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిత తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్, తల్లి పంజాబీ.
ఇక భారత మూలాలున్న జార్జ్ చాహల్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్నారు. సహజ వనరుల స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించారు. సిక్కుల కాకస్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. చాహల్‌ను లెజిస్టేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా నియమించింది. ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా గెలిచినా, ప్రధాని పదవికి అర్హడు కాదని తెలుస్తోంది. కెనడా చట్టాల
మేరకు తాత్కాలిక ప్రధాని పదవ చేపట్టడానికి అనర్హులు.