ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేల్చి 9 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. బీజాపూర్ జిల్లా కుత్రూ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని బీజాపూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు.
నారాయణపూర్, బీజాపూర్ పోలీసులు, సైనికబలగాలు ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గత కొంత కాలంగా మావోయిస్టుల ఏరివేతకు బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. గత కొంత కాలంగా మావోయిస్టులను బలగాలు వేటాడుతున్నాయి. ఆరు మాసాల్లోనే 120 మంది మావోయిస్టును చంపేశారు. దీంతో మావోయిస్టులు ప్రతీకార చర్యకు దిగారని అనుమానిస్తున్నారు.