చైనాలో వ్యాపిస్తోన్న హెచ్ఎంపీ వైరస్ భారత్ చేరింది. ఇవాళ ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులు, గుజరాత్లో మరొకరికి హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన చిన్నారి వైద్యం చేయించుకుని డిశ్ఛార్జ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. మరొకరికి వైద్యం అందిస్తున్నారు. గుజరాత్లో అహ్మదాబాద్‌లోనూ చిన్నారిలో హెచ్ఎంపీ వైరస్ గుర్తించారు. అయితే చైనాలో వెలుగు చూసిన వైరస్, భారత్‌లో వెలుగు చూసిన వైరస్ ఒకటేనా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది.
హెచ్ఎంపీ వైరస్ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులపై దాడి చేస్తోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రమైతే నిమోనియా, బ్రాంకైటీస్‌కు దారితీయవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, దద్దుర్లు ఉన్న వారు తప్పనిసరిగా డాక్టర్లను సంపద్రించాలని సూచిస్తున్నారు.
భారత్‌లో ఇవాళ ఒక్క రోజే మూడు కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.విదేశీ ప్రయాణాలు చేసిన దాఖాలాలు లేని ముగ్గురు చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ ఎలా సోకిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులపై విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు మాస్క్ ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.